వైసీపీ జాబ్ మేళా కార్యక్రమంలో టీడీపీ నిరసన
విశాఖలోని ఆంధ్రా యూనివ్సటీలో వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమంలో టీడీపీ నిరసనకు దిగింది. సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేసుకొని జాబ్ మేళా కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు అప్పలనాయుడు పలువురు పార్టీ కార్యక్తలతో వెళ్లారు. అయితే ఆయన్ను పోలీసులు యూనివ్సటీ గేట్ వద్దే అడ్డుకున్నారు. దీంతో బండారు అప్పల రాజు అక్కడే నిరసనకు దిగారు. ఇది పార్ట్‌టైం జాబ్ మేళా అని విమర్శించారు.
జగన్ సర్కార్ ఎన్నికల ముందు జాబ్ మేళా కార్యక్రమాలు చేపట్టింది నిరుద్యోగుల ఓట్ల కోసమే అన్నారు. వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమంలో సెక్యూరిటీ పోస్ట్ కూడా లేదని ఎద్దేవా చేశారు. గతం ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పదవి కాలం దగ్గర పడిందని, ఈ కార్యక్రమంలో పాల్గొంటే లోకేష్ జాబ్ ఇప్పిస్తామని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.