బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు
క్రికెట్ లెజెండ్ సచిన్ కూతురు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . సారా పోస్ట్ చేసిన వీడియో…గ్లామర్ వరల్డ్‌లోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సారా… ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రిల్ చేసింది సారా. ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ కామెంట్లు చేస్తున్నారు.
లండన్‌లో చదువు పూర్తి చేసిన సారా మోడలింగ్ వైపు అడుగుపెట్టింది. ఇప్పటికే క్లాత్ బ్రాండ్స్ కి మోడలింగ్ చేస్తుంది. సోషల్ మీడియాలో బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ సంపాదిస్తోంది. మోడలింగ్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటుందట. ఇప్పటికే పలు ఆడిషన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే బాలీవుడ్ కి మరో హీరోయిన్ దొరికినట్టే.