IPL2022: లక్నో టార్గెట్ 182
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నోసూపర్ జాయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ డు ప్లెసిస్ 96 పరుగులతో చెలరేగాడు. మ్యాక్స్‌వెల్ 23 పరుగులుతో రాణించాడు. షాబాబ్ ఆహ్మద్ 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ వీరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మరోవైపు లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు 182 పరుగుల టార్గెట్‌తో భరిలోకి దిగిన లక్నో జట్టు ఏడు ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.