మా అన్న మీద కోపం ఉంటే పార్టీ ఇక్కడ ఎందుకు పెడుతా: షర్మిల
కేటీఆర్‌పై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనకు తన అన్న జగన్ మీద కోపం ఉందని, ఆయన మీద కోపంతోనే తాను ఇక్కడ పార్టీ పెట్టినట్లు కేటీఆర్ అంటున్నారని షర్మిల తెలిపారు. తన అన్న మీద కోపం ఉంటే తాను ఇక్కడ ఎందుకు పార్టీ పెడుతానని అమే ప్రశ్నించారు. తన అన్న మీద కోపం ఉంటే తాను ఏపీలోనే పార్టీ పెడుతాను కానీ తెలంగాణలో ఎందుకు పెడుతానన్నారు. తనకు ఎవరి మీద కోపం లేదన్నారు షర్మిల.
మరోవైపు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు కేటీఆర్ అన్నారన్న షర్మిల అది అవాస్తవమన్నారు. బీజేపీ పార్టీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేది టీఆర్‌ఎస్ పార్టీ నేతలేన్నారు. టీఆర్‌ఎస్ తెర వెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటున్నారా అని ప్రశ్నించారు. తమకు ఎవరితో పొత్తులు లేవన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఎవరికీ ఏజెంటు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ కాంగ్రెస్ ఓట్లను చీల్చుతామని షర్మిల పేర్కొన్నారు.