చీనాబ్ నదిపై ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణానికి డెడ్ లైన్ ఫిక్స్?
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో పూర్తి కానుంది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. ఈ వంతెన కాశ్మీర్‌ను కన్యాకుమారితో కలపనుండి. ఇక అదే సమయంలో, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థను త్వరలో రెట్టింపు చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను కేంద్రం రెట్టింపు చేసి ఆ ప్రాంత అభివృద్ధి, శ్రేయస్సు, పురోగమనానికి భరోసానిస్తుందని సిన్హా చెప్పారు. జమ్మూలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జమ్మూ కాశ్మీర్‌కు కేటాయించిన వార్షిక బడ్జెట్ రూ.1.12 లక్షల కోట్ల గురించి ఆయన వెల్లడించారు. . ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. చీనాబ్ నదిపై అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఈ ఏడాది సెప్టెంబర్‌లో సిద్ధమై కన్యాకుమారితో అనుసంధానం కానుందని… ఆగస్టు 2019 నుండి ఈ ప్రాంత అభివృద్ధి వేగం రెట్టింపు అయిందని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు కేటాయించిన బడ్జెట్‌లో ఎలాంటి వివక్ష లేకుండా 1.30 కోట్ల మందికి ఖర్చు చేస్తామన్నారు. ఈ బడ్జెట్ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని అన్నారు. ఈ వంతెన 1.315 కి.మీ పొడవు ఉండనుండగా నది నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. విశేషమేమిటంటే, దీని పొడవు పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. దీని నిర్మాణంలో 28 వేల 660 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు.