Wrestlers Metoo Movement: లైంగిక వేధింపులపై మహిళా రెజ్లర్ల మీటూ ఉద్యమం… సోషల్ మీడియా సహకారం
Wrestlers Metoo Movement: బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అనేక మంది మహిళా క్రీడాకారిణులు రోడ్డెక్కారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు దిగారు. మహిళా కోచ్‌లపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటూ మీటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మహిళా క్రీడాకారిణుల ఉద్యమానికి దేశంలోని అన్ని వర్గాల నుండి సపోర్ట్ లభిస్తున్నది. రాజకీయ, క్రీడా, వాణిజ్య, సినిమా, రచయిత, గాయకుల నుండి సపోర్ట్ లభిస్తుండటంతో పాటు, సోషల్ మీడియా నుండి కూడా పెద్ద ఎత్తున సహకారం లభిస్తుండటంతో దేశంలో ఈ సంఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది.
వీరికి బీజేపీ నేత క్రీడాకారిణి బబితా ఫొగట్ కూడా మద్దతు పలికారు. ఎంపీ వ్యవహారంపై బీజేపీ స్పందించింది. ప్రధాని సైతం ఈ వ్యవహరంలో జోక్యం చేసుకున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వ్యవహారం ఏంటో చూడాలని కేంద్ర క్రీడాశాఖామ మంత్రిని ఆదేశించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని మహిళా క్రీడాకారిణిలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆయన్ను ఆ పదవి నుండి తొలగించాలని, ఎంపీగా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారంపై జాతీయ మహిళా చైర్‌పర్సన్ విచారణకు ఆదేశించారు.