గౌతమ్ రెడ్డి వారసుడిగా విక్రమ్..మేకపాటి ప్రకటన
అంతా ఊహించిందే జరిగింది. మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా మా రెండో అబ్బాయికి విక్రమ్‌ను నిర్ణయించామని వైసీపీ సీనియర్ నేత, దివంగత గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయని అన్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఎవరెవరు పోటీలో ఉంటారో తెలుస్తోందని ఆయన అన్నారు. నియోజకవర్గానికి వెళ్లే ముందు జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్‌ను తీసుకు వచ్చానని అన్నారు. గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నానని, అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తానని అన్నారు. నియోజకవర్గానికి అన్న చేయాలనుకున్నది నేను చేసి చూపిస్తానని అన్నారు. తొలుత ఉప ఎన్నికల బరిలో గౌతమ్ రెడ్డి భార్య కీర్తి దిగవచ్చని అందరూ అనుకోగా మేకపాటి కుటుంబం మాత్రం ఆమెను బరిలోకి దింపకూడదని ఫిక్స్ అయింది. దీంతో ఎక్కడో ఉన్న గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని రంగంలోకి దించారు.