ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యకు చెక్?
ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ కు ఉన్న ఏకైక డ్రా బ్యాక్ ఏమిటి అంటే ఒక సారి పోస్ట్ చేసిన దానిని ఎడిట్ చేసే ఆప్షన్ ట్విట్టర్ నిర్వాహకులు కల్పించలేదు. ట్విట్టర్ పై ఎడిట్ బటన్ ఎప్పటికీ ఉండదు అంటూ ట్విట్టర్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే గతంలో ఒక ప్రకటన చేశారు. వ్యవస్థాపకుడు అలా మాట్లాడడంతో ఇక ఆ అవకాశమే లేదని అందరూ భావించారు కానీ ఆ సదుపాయం ట్విట్టర్ యూజర్లకు త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా తాము ఎడిట్ బటన్ తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ పై ఎడిట్ బటన్ రావడానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృషి కూడా కొంత ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎడిట్ బటన్ కోరుకుంటున్నారా? అంటూ ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. మెజారిటీ యూజర్లు కావాలని పోల్ చేశారు. దీంతో ఎడిట్ బటన్ తెస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఎడిట్ బటన్ ఉపయోగించుకుని ట్వీట్ లోని సమాచారాన్ని ఎడిట్ చేసినా.. పాత ట్వీట్ కూడా అలానే ఉంటుందని అంటున్నారు. ముందు ట్వీట్ లోని సమాచారాన్ని మార్చేస్తుందా..? కొత్త ట్వీట్ గా పంపిస్తుందా? ఎడిట్ తర్వాత తాజా ట్వీట్ అందరికీ కనిపిస్తూ.. ముందు ట్వీట్ కేవలం ట్విట్టర్ డేటా బ్యాంకులో నిల్వ ఉంటుందా? వంటి విషయాల మీద క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.