నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3334 ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన జీవోలను కూడా తాజాగా జారీ చేసింది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్ సర్వీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖలోని 3334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఇక పోలీస్ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 3 ఏళ్లకు పెంచింది. వారు మాత్రమే కాక ఎక్సైజ్, ఫైర్, ప్రిజన్, ఫారెస్ట్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ సడలింపు వర్తిస్తుంది.