రాజకీయ దుమారం రేపుతున్న తల్లీకొడుకుల ఆత్మహత్య
తెలంగాణలో తల్లీకొడుకుల ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతోంది. తల్లీకొడుకు మృతదేహాలతో బంధువులు అంతిమయాత్ర నిర్వహించారు. మృతదేహాలతో మున్సిపల్ ఛైర్మన్ ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లి….జితేందర్‌గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంతోష్‌ను భూముల అమ్మే విషయంలో తనకు 50 లక్షలు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఓ పోలీసు అధికారితో కలిసి డిమాండ్ చేసినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అధికార పార్టీ నేతలు, పోలీసులు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంతోష్ చెప్పాడు. రామాయంపేటకు చెందిన ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారంటూ గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొడుకు ఆత్మహత్య కేసులో… పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ సెల్ఫీ వీడియో ఆధారంగా…కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ జితేందర్, సీఐ నాగార్జున గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి, తోట కిరణ్, కృష్ణగౌడ్, స్వరాజ్‌పై కేసు పెట్టారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య రణరంగానికి దారి తీసింది. ఆత్మహత్య టిఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయంగా రచ్చ రేపుతోంది. పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల ఒత్తిడే కారణమని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.