Sankranthi Viral Poster: ఊరు పోతున్నాం, మా ఇంటికి రాకండి.. పోస్టర్ వైరల్!
Sankranthi Viral Poster: సంక్రాంతి అంటేనే తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అంటూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడెక్కడికి వెళ్లి స్థిరపడిన వారయినా ఈ సంక్రాంతికి మాత్రం సొంతూళ్ళకు రావడం చాలా మందికి ఆనవాయితీగా వస్తోంది. అలా ఇంటిల్లిపాదీ సొంతూళ్లకు పయనం అయితే దొంగలు కూడా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక ఇంటి యజమాని మాత్రం మేము సంక్రాంతికి ఊరు వెళుతున్నాము అని చెబుతూ తలుపుకు ఒక పోస్టర్ అంటించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ‘’మేము సంక్రాంతికి ఊరు పోతున్నాం డబ్బు నగలు కూడా మాతో పాటు తీసుకెళ్లి పోతున్నాం, మా ఇంటికి రాకండి’’ ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ తాళం వేసిన తలుపుకు పోస్టర్ అంటించాడు సదరు ఇంటి యజమాని. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.