టిఆర్ఎస్ కు మా మీద ఇంట్రెస్ట్ పెరిగింది.. మాకొద్దు బాబోయ్!
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాల మీద స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఖమ్మంలో పిడియాక్ట్ పెట్టి వేధిస్తున్నారని, ఈ అంశం మీద కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. స్వయంగా ఏసీపీ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని ఆమె అన్నారు . పువ్వాడ అజయ్ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసు లో A1 నిందితుడు అని ఆమె విమర్శించారు. అసలు రాష్ట్రం ఏమై పోతుందో అర్థం కావడం లేదని మంచి పోలీసులు బతికి ఉండే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ లేదు..ప్రొసీజర్ లేదు, గవర్నర్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో కి వెళ్తే సెక్యూరిటీ కూడా ఉండదా..? అని ఆమె ప్రశ్నించారు. అసలు ఐఏఎస్..ఐపీఎస్ లకు రాజకీయాలకు ఏం సంబందం? అధికారులు రావాలి కదా.. అని అన్నారు.
రేవంత్ రెడ్డిని ఖమ్మం రానివ్వం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి…ఖమ్మంలో తనకంటే లోకల్ ఎవరూ లేరని ఆమె అన్నారు. తానే స్వయంగా రేవంత్ ను ఖమ్మం తీసుకువెళతానని ఖమ్మం రేవంత్ రాక కోసం ఎదురు చూస్తోందని అన్నారు. టిఆర్ఎస్ కు ఈ మధ్యనే మా మీద ఇంట్రెస్ట్ పెరిగిందని కానీ మేము అంత ఇంట్రెస్ట్ గా అయితే లేము అని రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరని అందుకే టీఆర్ఎస్ మాకు ఎంత దూరంగా ఉంటే మాకే అంత మంచిదని అన్నారు. రజాకార్ల ను ఎదుర్కొన్న పోలీసులు…ఇప్పుడు ఇలా మారిపోవడం దురదృష్టకరం అని ఆమె అన్నారు. అమరావతి కాదు కమ్మరావతి అన్నాడో సీఎం, ఆ పేరు పెట్టు చూద్దాం అంటూ ఆమె సీరియస్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గాన్ని అన్నిచోట్ల తొక్కేస్తున్నారు కానీ అన్ని విషయాల్లోనూ వాళ్ళ అవసరమే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.