బాబు పనైపోయింది..పవన్ కి ఇస్తే మంచిది!
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపిని సమాధి చేద్దామని నా వెంట నడుస్తున్న వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉంటే చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారని కాబట్టి పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇస్తేనే చంద్రబాబుకు మంచిదని అన్నారు. రాప్తాడు అభివృద్ధి లో తగ్గేదేలేదన్న ఆయన మంచంపై ఉన్న మా నాన్నపైన, మా వదిన పైన, ఆరోగ్యం బాగలేక ఉన్న మా అన్న పైన నిందలు వేస్తున్నారని అన్నారు. జిల్లాలోని అతిపెద్ద నియంతృత్వ కుటుంబాన్ని మట్టికరిపించామని, కానీ జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కలేదని అన్నారు. సామాజిక సమీకరణాలతో, జిల్లాలోని సమీకరణాలతో నాకు మంత్రి పదవి రాలేదని ఆయన అన్నారు. నాతోనే ఉండమని వైస్సార్ రాజశేఖర రెడ్డి చనిపోయిన మూడో రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.