సోనియా గాంధీతో పీకే భేటీ..పార్టీ పరిస్థితిపై ప్రజెంటేషన్
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తో పాటు ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ చాలా విపులంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పీకే అభిప్రాయాలను, ప్రజెంటేషన్ ను సోనియా గాంధీ ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించనుంది. గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు..ఇప్పటికే బీజేపీయేతర పార్టీల అధ్యక్షులు, సీఎంలతో పీకే వరుస భేటీలు నిర్వహిస్తున్నారు..ఈ మధ్యకాలంలో కేంద్రం మీద విరుచుకు పడుతున్న విపక్ష పార్టీల సీఎంల దూకుడు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందని రాజకీయ సర్కిల్ లో చర్చ జరుగుతుంది..
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా కాంగ్రెసేతర సీఎంలలో ఐక్యత తీసుకురావడానికి బెంగాల్, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే తన ఐపాక్ ద్యారా ఒప్పందాలు చేసుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు..మరోవైపు గతంలో ప్రశాంత్ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో వరుస భేటీలు కావడంతో పీకే కాంగ్రెస్ చేరుతారని..ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది..
తాజాగా పీకే కాంగ్రెస్‌లో చేరిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. కానీ.. రాబోయే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే, గుజరాత్ పోల్స్‌పై చర్చించడానికే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల విషయంలో బ్లూప్రింట్‌పై కూడా చర్చించే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీకే శిష్యుడు ‘సునీల్ కనుగోలు’కు కూడా ఇదే తరహా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారన్న ప్రచారమూ వుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.