Padma Awards 2022: కీరవాణి, చినజీయర్ లకు పద్మ అవార్డులు
Padma Awards 2022: ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కేంద్రం ప్రకటించిన జాబితా మేరకు మొత్తం 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వారిలో తెలంగాణ నుంచి ఫ్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్య విభాగంలో,సాహిత్యం విభాగంలో పద్మశ్రీ దక్కగా, ఏపీ నుంచి సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ అనే సామాజిక వేత్తకు పద్మశ్రీ లభించింది. అలాగే తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు, రెండు పద్మభూషణ్, మూడు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఆధ్యాత్మిక విభాగంలో చినజీయర్ స్వామి, కమలేశ్ డి పాటిల్ లకు పద్మభూషణ్ పురస్కారాలు లభించగా శాస్త్ర, సాంకేతిక విభాగంలో మొదడుగు విజయ్ గుప్తా, ఔషధారంగంలో హనుమంత రావు పసుపులేటికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి పద్మశ్రీ అవార్డు లభించింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ర్టాల నుంచి నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ఇక మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ముఖ్యమైనవిగా చెప్పే పద్మ అవార్డులు 1954లో మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటించి రాష్ట్రపతి చేతుల మీదుగా అందచేస్తారు.