Richest Cast: ఈ పిల్లి పేరిట ఎంత ఆస్తి ఉందో తెలుసా?
Richest Cast: ఇంటిమీద, స్థలాల మీద పెట్టుబడులు పెట్టేవారు ఉన్నారు. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు ఉన్నారు. అయితే, కొంతమంది మాత్రం తమ పెంపుడు జంతువులపై పెట్టుబడులు పెడుతుంటారు. ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేసి వాటని జాగ్రత్తగా పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. నెలకు లక్షల చొప్పున ఖర్చు చేసేవారు కూడా ఉంటారు. అయితే, పెంచుకున్న జంతువులకు ఆస్తీని రాసిచ్చేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కూడా ఒకరు. ఆమె దగ్గర ఒలివియో బెన్సన్ అనే పిల్లి ఉన్నది. ఆ పిల్లి అంటే ఆమెకు ప్రాణం. దానిని మహరాణిలా చూసుకుంటుంది.
అంతటితో ఆగకుండా ఆ పిల్లిపేరు మీద ఏకంగా రూ.800 కోట్ల ఆస్తిని రాసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రూ 800 కోట్ల ఆస్తికి ఆ పిల్లి వారసురాలు. అత్యంత ఆస్తిని కలిగిన జంతువుల్లో ఇది మూడోది. గున్థర్ VI అనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం ప్రపంచంలోనే అత్యంత ఆస్తికలిగిన జంతువు. ఇది ప్రస్తుతం జర్మన్ షెపర్డ్ గున్థర్ కార్పోరేషన్ యాజమాన్య ఆధీనంలో ఉన్నది. ఇక నాలా క్యాట్ అనే పిల్లి రూ. 1000 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉండటం విశేషం. పెంచుకున్న జంతువులపై ఆస్తిని రాసివ్వడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. తాము ఉన్నా లేకున్నా పెంపుడు జంతువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని యజమానులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.