Solar cyclone: సోలార్ సైక్లోన్ ఎఫెక్ట్ ..జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
Solar cyclone: ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన కీలక వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సూర్యుడి నుంచి సౌర తుఫానులు వెలువడుతున్నాయని, అందులో ఓ సౌర తుఫాన్ ఈరోజు నేరుగా భూమిని ఢీకొని అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. ఈ సౌర తుఫాన్ భూమిని ఢీ కొడితే అనేక వ్యవస్థలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నాసా హెచ్చరించింది. ముఖ్యంగా జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడవచ్చని నాసా తెలియజేసింది.
అదే విధంగా జులై 20, 21 తేదీల్లో జీ 1 క్లాస్ తుఫానులు రావొచ్చని అంతరిక్ష వాతావరణ సంస్థ పేర్కొన్నది. సూర్యుని నుంచి వెలువడే సౌర శక్తి భూమిపై ఉన్న అన్ని విద్యుత్ సంస్థలు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తి కంటే లక్ష రెట్లు అధికంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సోలార్ తుఫానులు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని, సౌర తుఫానుకు సంబంధించిన కిరణాలు డైరెక్ట్ గా శరీరాన్ని తాకితే శరీరం రుగ్మతల బారిన పడే అవకాశం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.