World Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ద మహిళ ఈమే!
World Oldest Person: ఈ రోజుల్లో 70 నుంచి 80 ఏళ్లు జీవించే వారు కూడా చాలా తక్కువ అయిపోయారు. ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు వాతావరణం కారణంగా 50 ఏళ్ల తర్వాత ప్రతిఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ రోజు మనం 100 ఏళ్లు దాటి 115 ఏళ్లు నిండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)లో తన పేరును చేర్చుకున్న ఒక మహిళ గురించి చెప్పబోతున్నాం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) ఈ మేరకు ఒక పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ మహిళ 115 సంవత్సరాల వయస్సుతో ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకు ఎక్కింది.
బ్రన్యాస్ మోరీరా అనే మహిళ మార్చి 1907లో అమెరికాలో జన్మించిందని సంస్థ పంచుకుంది. ఇక ఆమె ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తున్నారు. GWR మోరీరా ఫోటో షేర్ చేసి “మిసెస్ మోరీరా 19 జనవరి 2023 నాటికి 115 సంవత్సరాల 321 రోజులు. 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత బ్రన్యాస్ మోరీరా (USA/స్పెయిన్) ఇప్పుడు జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా నిర్ధారించబడింది అని పేర్కొన్నారు. ఇక ఆమె 1907 మార్చి 4న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత, ఆమె తల్లిదండ్రులు వెళ్లారు. ఆమె గత 22 సంవత్సరాలుగా – రెసిడెన్సియా శాంటా మారియా డెల్ తురా నర్సింగ్ హోమ్లో నివసిస్తోంది.