Gunmen security: తోపుడు బండి వ్యాపారికి గన్మెన్లు.. ఎందుకంటే?
Man Sells Clothes By Handcart Under The Police Protection: ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో రామేశ్వర్ అనే వ్యక్తి మాములుగా తోపుడు బండి మీద పాత బట్టలు విక్రయిస్తూ ఉంటారు. రోజూ అలాగే అమ్ముతున్న క్రమంలో ఆయన బండి వద్దకు ఇద్దరు గన్లు పట్టుకున్న వ్యక్తులు వచ్చారు. దీంతో వారు కస్టమర్లు అనుకున్నాడు. కానీ మీకు రక్షణ కల్పించడానికి వచ్చామని చెప్పడంతో షాకయ్యాడు. అసలు విషయం ఏంటంటే రామేశ్వర్‌కు తన స్వగ్రామంలో కాస్త భూమి ఉంది. కానీ దానికి పట్టా లేదు. అందుకే తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశారు.
అయితే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తడంతో అది వివాదానికి దారి తీసింది. జుగేంద్ర సింగ్.. తనను కులం పేరుతో దూషించారని రామేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దయాల్. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్లారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో విచారణలో రామేశ్వర్ ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన రామేశ్వర్‌ను చూసిన న్యాయమూర్తి బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. అంతేకాక బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్ నియమించాలని ఆదేశించారు. ఈ కారణంగా ఆయనకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు. ఇక ఈ కారణంగా రామేశ్వర్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది.