Flight Proposal: ఆకాశంలో ప్రపోజల్.. యమా క్రేజీ గురూ!
Man Gets Down On His Knee Proposes To Fiance: కొంత మంది తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తనకు కాబోయే భర్తకు ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను చాలా విలక్షణమైన రీతిలో పెళ్లికి ప్రతిపాదించాడు. అతని ప్రపోజల్ చూసి, ఆ వ్యక్తికి కాబోయే భార్య పూర్తిగా షాకింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన వీడియోలో విమానం గాలిలో తగినంత ఎత్తుకు చేరుకున్న తర్వాత, అతను నెమ్మదిగా లేచి వెనుకకు వచ్చాడు, అక్కడ అతనికి కాబోయే భార్య కిటికీకి సమీపంలో ఉన్న సీటుపై కూర్చుని, బయటకు చూస్తోంది.
ఆ సమయంలో సదరు యువకుడి చేతిలో పెద్ద పింక్ కలర్ బ్యానర్ ఉంది, దానిపై అతనికి కాబోయే భార్య ఫోటోలు అతికించబడ్డాయి. బ్యానర్ మధ్యలో ఇంగ్లీషులో ‘నేను నీతో జీవితాంతం నడుస్తాను, నువ్వు కూడా నాతొ నడవాలి అనుకుంటున్నావా? అంటూ రాసి ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన అమ్మాయి, నోటిని తన చేతులతో కప్పుకుని సిగ్గు పడింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మోకాళ్లపై నిలబడి, జేబులోంచి రింగ్ బాక్స్ తీసి ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు. ఇక సదరు యువకుడికి కాబోయే భార్య లండన్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై వెళ్తోంది. ఈ సమయంలో, వ్యక్తి తన కాబోయే భర్తను ప్రపోజ్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఆ వ్యక్తి తనకు కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన తీరు చూసి ఫ్లైట్‌లో ఉన్న వాళ్లంతా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమను వ్యక్తపరిచే అతని స్టైల్ చూసి ప్రజలు అభినందిస్తున్నారు.