Man Complaint on Wife: నా భార్య ఎక్కువ నిద్ర పోతుంది.. పోలీసుల ముందుకు వింత కంప్లైంట్!
Man Complaint on Wife: బెంగళూరులో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా నిద్ర పోతుందని తన భార్యపై ఓ భర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అది చూసి పోలీసులు షాకయ్యారు. అసలు విషయం ఏమిటంటే బెంగళూరులోని బసవ గూడకు చెందిన కమ్రాన్ ఖాన్ కు కొన్నాళ్ల క్రితం ఆయేషా అనే యువతితో పెళ్లైంది. కానీ పెళ్లి అయినప్పటి నుంచి చి తన భార్య ఎక్కువ టైం నిద్ర పోతుందని కమ్రాన్ చెప్పుకొచ్చాడు. రాత్రి నిద్రపోయి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిద్రపోతుందని, ఒకవేళ నిద్రలేపాలని చేస్తే తిడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే రాత్రి 9: 30 గంటల వరకు నిద్రపోతునే ఉంటుందని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఇలా ఎక్కువ సేపు నిద్ర పోయే వాళ్ళు పెళ్లి చేసుకోవడం దేనికని ప్రశ్నించాడు. తన భార్య ఏ పనీ చేయదని, అంతా తన తల్లి చేస్తుందని కమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. పని చేయమంటే చిరాకు పడటం, తిట్టడం చేస్తుందని చెబుతున్నారు.