కేటీఆర్ చెప్పింది నిజమే.. సాక్ష్యం విడుదల చేసిన నారాయణ
ఏపీ గురించి మంత్రి కేటీఅర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని సిపిఐ నారాయణ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రోడ్లలో గతుకులు,గుంతలు మీద, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తాను అని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. స్వయానా ఆంధ్ర తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సందర్శించి ఆంధ్ర రోడ్ల యొక్క స్థితిగతులను తమిళనాడు రాష్ట్రం యొక్క స్థితిగతులను వీడియో ఆధారాలతో సహా నారాయణ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితులేమో గుంతలమయంగా ఉందని, తమిళనాడు రాష్ట్ర రోడ్లు చక్కగా ఉన్నాయని, ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అయన పేర్కొన్నారు. నగరి మండలం తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వచ్చే రోడ్ల పరిస్థితి చూడండి అని వీడియోలో నారాయణ వివరించారు.