ఇండిగో అలసత్వం.. హ్యాక్ చేసి పని కానిచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్
విమానాల్లో లగేజీ మిస్సయిన సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఒక వేళా మీరు కూడా విమానంలో ఎక్కువ ప్రయాణం చేస్తుంటే, మీరు కూడా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని ఉంటారు. అయితే ఆ బ్యాగ్ మళ్ళీ మనం పొందాలి అంటే ఒక యజ్ఞమే చేయాలి. కస్టమర్ సర్వీస్ అని పేరుకు ఉంటుంది కానీ వాళ్ళని సంప్రదించినా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నందన్ కుమార్‌కు కూడా అలాంటి సంఘటన ఎదురైనప్పుడు ఎయిర్‌లైన్ కంపెనీ వెబ్‌సైట్ హ్యాక్ చేసి తన బ్యాగ్‌ని వెనక్కు తెచ్చుకోగలిగాడు. నిజానికి నందన్ పాట్నా నుంచి బెంగళూరు ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో అతని బ్యాగ్‌ను మరొక ప్రయాణికుడి బ్యాగ్‌తో మారింది. ఈ విషయం నందకుమార్ భార్య ఇంటికి వెళ్ళాక గమనించి చెప్పింది. దీంతో అతను ఇండిగో కస్టమర్ కేర్‌కు కాల్ చేసాడు. అయితే కస్టమర్ కేర్ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ డెవలపర్ అయిన నందకుమార్ ఇండిగో వెబ్ సైట్ ను ”హ్యాక్” చేసి స్వయంగా తన బ్యాగ్ తీసుకెళ్లిన ప్రయాణికుని వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత బ్యాగ్ మార్చుకోవడమే కాక తాను ఆ సైట్ ను ఎలా హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడో ట్విట్టర్ ద్వారా మొత్తం చెప్పుకొచ్చాడు. అంతేకాక ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇండిగో సంస్థకు సూచనలు కూడా చేశాడు.