Commonwealth Games 2022, Miracles, Indian Players, Triple Jump, Gold, Silver
Two More Medals for India: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ప్లేయర్లు చరిత్ర సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తాచాటుతున్నారు మన క్రీడాకారులు. ఇవాళ బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు సాధించగా.. మహిళల హాకీలో ఓ కాంస్య పతకం వచ్చింది. తాజాగా ట్రిపుల్ జంప్‌లో సైతం భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. అథ్లెట్ పాల్ 17.03 మీటర్ల జంప్‌తో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా.. ఇదే ఈవెంట్లో మరో అథ్లెట్ అబ్దుల్లా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు
పాల్ 17.03 మీటర్ల జంప్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో మరో అథ్లెట్ అబ్దుల్లా అబుబకర్ రెండవ స్థానంలో నిలిచాడు. అబ్దుల్లా 17.02 మీటర్లు దూకాడు. పాల్ తన తొలి ప్రయత్నంలో 14.62 మీటర్లు జంప్ చేయగా.. ఆ తర్వాత, అతను తదుపరి ప్రయత్నంలో 16.30 మీటర్లకు చేరుకున్నాడు. అనంతరం పాల్ 17.03 మీటర్లు దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరో భారత అథ్లెట్ ప్రవీణ్ కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయాడు. అతను నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.