మండిపోతున్న వంట నూనె ధరలు.. మరింత పెరిగే అవకాశం?
సామాన్యులపై వంట నూనెల ధరల భారం పడింది. గత వారం రోజులుగా రూపాయికి పది రూపాయలు చొప్పున ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఒక్క రోజే సన్ ఫ్లవర్ ఆయిల్ పై నాలుగు రూపాయలు పెంపుదల చేసినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు వంద లోపు ఉండే ఆయిల్ ధరలు ఇప్పుడు 200 కి పైనే ఉందని అంటున్నారు. కుకింగ్ ఆయిల్స్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఎఫెక్ట్ తో భారీగా ధరలు పెరిగిన నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ఆయిల్ ధరలు అయితే ఈ మేరకు ఉన్నాయి. పప్పు నూనె కేజీ 380, కేజీ సన్ ఫ్లవర్ ఆయిల్ 223 రూపాయలు, శనగ నూనె కేజీ 199 రూపాయలు, పామాయిల్ కేజీ 178 రూపాయలుగా ఉంది. రైస్ బ్రోన్ ఆయిల్ కేజీ 195 రూపాయలుగా ఉంది.