పెట్రోలు, డీజల్ ధరలను మరింత పెంచిన ప్రభుత్వం ..తీవ్ర ఉద్రిక్తత
శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం మరింత పెంచింది. లీటర్ పెట్రోల్ 338 రూపాయలు, లీటరు పవర్ పెట్రోల్ 373 రూపాయలు, లీటర్ డీజిల్ ధరను 329 రూపాయలు దాకా పెంచింది. ధరలు పెంచడంతో రైల్వే ట్రాక్ ల వద్ద, బస్సు బస్టాండ్ ల వద్ద లంక వాసుల ధర్నా చేస్తున్నారు. పార్లమెంట్ లో ధరల పెంపు మీద విపక్షాల ఆందోళన నేపథ్యంలో గంట పాటు పార్లమెంట్ ను స్పీకర్ వాయిదా వేశారు. అయితే తమ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి తప్పటడుగులే కారణమని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. 17 మంది నూతన కేబినెట్ మంత్రులను నియమించిన సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడుతూ. ‘‘గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి, అప్పుల భారం, మా వైపు నుంచి కొన్ని తప్పులు ఈ దుస్థితికి కారణమని అన్నారు. వీటిని చక్కదిద్ది ముందుకు వెళ్లాల్సి ఉంది. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాల్సి ఉందని అన్నారు. ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రజలు నేడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈ పరిస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. నిత్యావసరాల కోసం పొడవాటి లైన్లలో వేచి ఉండాల్సి రావడం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం, అసహనం అర్థం చేసుకో తగినవని రాజపక్స నూతన మంత్రులతో అన్నారు.