టీడీపీలోకి వలసలు పెరుగుతాయి: గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బలవంతుడిగా కనిపించినా…బలహీనమైన నాయకుడని కేబినెట్ విస్తరణతో తేలిపోయిందని ఆయన అన్నారు. క్యాబినెట్ కూర్పు పై సీఎం దిష్టిబొమ్మను, టైర్లను కాల్చుతూ ఆందోళన చేయడం నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూశానని ఆయన అన్నారు. జగన్ జరిపిన విద్యా శాఖ సమీక్షలో ఆ శాఖ మంత్రి పాల్గోకపోవడంతోనే నూతన క్యాబినెట్ ఏర్పాటులో ఎక్కడా సమతుల్యత లేదని అర్ధం అవుతోందని ఆయన అన్నారు. 26 జిల్లాలు అని చెప్పి ప్రధాన నగరమైన విశాఖకు, విజయవాడకు, తిరుపతి మంత్రులు లేకుండా చేశారని ఆయన అన్నారు. ఎన్నికలకి రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం అంటే ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. టిడిపికి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చే కొలది టీడీపీలోకి చేరికలు ఎక్కువవుతాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రావచ్చని ఆయన అన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు పొత్తులు సర్దుబాట్లు ఉంటాయి తప్ప రెండేళ్ల ముందే ఊహించలేమని కూడా పొత్తుల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు.