యాదగిరిగుట్టలో భవనం కూలి నలుగురి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఏకంగా నలుగురు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఇక శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. యాదగిరి గుట్టలో నేడు కూలిన ఆ రెండంతస్తుల భవనం 30 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు.