ఏపీలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఆటోలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్యాసింజర్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆటోలను రెట్రోఫిట్టింగ్ చేసి ఎలక్ట్రిక్ వాహనంలా తయారు చేసేందుకు ప్రభుత్వం నెడ్‌కాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎలక్ట్రిక్ స్టేషన్‌లను ప్రారంభించేందుకు ఏపీ న్యూ రెన్యువబుల్ ఎనర్టీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రాంతాలను గుర్తించింది. ఇందులో భాగంగా ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తిరుపతిలో 200 ప్రాంతాలు, విశాఖలో 100 ప్రాంతాలను గుర్తించింది. ఈ వాహనాల మార్పు అనంతరం టెస్టింగ్ కోసం ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో నెడ్‌కాప్ ఒప్పందం కుదుర్చుకుంది.
మరోవైపు ఎలక్ట్రిక్ ఆటోలు వినియోగంలోకి రావాలంటే అపార్ట్‌మెంట్, పార్క్‌లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, పెట్రో బంకులతో పాటు జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులోకి రావాలన్నారు. బ్యాటరీ కూడా అక్కడే మార్చుకునే వెసులు బాటు కూడా ఉండాలని నెడ్‌కాప్ తెలిపింది.