Egg drop from Space: అంతరిక్షం నుంచి పడిన కోడి గుడ్డు ఏమయింది?
Egg droped from Space did not Crack
ప్రఖ్యాత యూ ట్యూబర్ మార్క్ రాబర్ అనేక ఆసక్తికర అంశాలపై వీడియోలు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా అప్‌లోడ్ చేసిన ఓ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. దాదాపు 27 నిమిషాల పాటు ఉన్న ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
నాసా మాజీ సైంటిస్టు కూడా అయిన మార్క్ రాబర్ లక్ష అడుగుల ఎత్తు నుంచి ఓ గుడ్డును నేలమీద సురక్షితంగా పడేట్లు చేయగలిగాడు. ఎంతో సమయం, ఎంతో ఖర్చుతో ఈ ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తన ప్రయత్నాలకు అన్నీ వివరిస్తూ వీడియో రూపొందించాడు.
హీలియం బెలూన్ సాయంతో గుడ్డును లక్ష అడుగుల ఎత్తుకు చేర్చగలిగాడు. అక్కడి నుంచి జారవిడిచాడు. 150 మైళ్ల దూరంతో దూసుకువచ్చిన గుడ్డు ఎటువంటి పగుళ్లు లేకుండా సురక్షితంగా నేలను చేరింది.
అంతరిక్ష ప్రయోగాల్లో అనుకోని ప్రమాదాలు ఎదురైతే సురక్షితంగా నేలకు చేరడం ఎలా అనే విషయమై దృష్టి పెట్టి ఈ ప్రయోగం చేసినట్లు మార్క్ తెలియజేశాడు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ వీడియోను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
This twitter video from 9 months ago should make more sense now with the video I released on YT today 🙂 https://t.co/qyDojKeGdt https://t.co/Yh8PXVEPRZ
— Mark Rober (@MarkRober) November 26, 2022
So Mark Rober spent 3 years making this video. In 2 days, the video has amassed 12M views.
The resilience, ingenuity, and technical skills exhibited in this video is worth every minute. So much motivation for me.
Incredible!https://t.co/LAIRoCM4co
— PKBinspire on YouTube (@princeboadu) November 28, 2022