జియోమీకి భారీ షాక్?
షియోమీ టెక్నాలజీ ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. 5,551.27 కోట్ల విలువైన జియోమీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. నెల రోజుల విచారణ తర్వాత దర్యాప్తు సంస్థ ఈ చర్యలు తీసుకుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 కింద కంపెనీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ఈడీ స్వాధీనం చేసుకుంది. కంపెనీపై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఫెమాను ఉల్లంఘించడంతోపాటు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
జియోమీ ఇండియా 2014లో భారతదేశంలో తమ ప్రొడక్ట్స్ అమ్మడం మొదలు పెట్టింది. ఈ జియోమీ ఇండిన, చైనా ఆధారిత ప్రముఖ మొబైల్ కంపెనీ జియోమీకు అనుబంధ సంస్థ. జియోమీ ఇండియా 2015 నుంచి తన మాతృ సంస్థకు డబ్బు పంపడం ప్రారంభించింది. అలా కంపెనీ మొత్తం రూ.5,551.27 కోట్లను విదేశీ కంపెనీలకు పంపింది. రాయల్టీ చెల్లించే నెపంతో షియోమీ ఇండియా ఇంత భారీ మొత్తాన్ని పంపిందని ఈడీ చెబుతోంది. ఇందులో షియోమీ గ్రూపునకు చెందిన ఓ విదేశీ కంపెనీ కూడా ఉంది. మరో రెండు కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా, కేవలం షియోమీ కంపెనీలకు మాత్రమే వాటి వల్ల అంతిమ ప్రయోజనం లభించింది. చైనీస్ మాతృ సంస్థ ఆదేశాల మేరకు జియోమీ భారతీయ విభాగం ఈ మొత్తాన్ని ఈ కంపెనీలకు బదిలీ చేసింది.