అక్బరుద్దీన్ ఓవైసీకి ఊరట.. కానీ?
వివాదాస్పద వ్యాఖ్యలు కేసులో అక్బరుద్దీన్ ఓవైసీకి ఊరట లభించింది. నిజామాబాద్, నిర్మల్ రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేసింది. ఈ రెండు కేసుల కొట్టివేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయరాదని సూచించింది. అంతేకాక ఈ కేసులు కొట్టి వేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దు అని కోర్టు సూచించింది. అంతేకాక అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ఆయనను మందలించిన కోర్టు, మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని అక్బర్ న్యాయవాదికి న్యాయమూర్తి సూచించారు. అక్బరుద్దీన్ డిసెంబర్ 22 2012 లో నిర్మల్ లో విద్వేషపూరిత ప్రసంగం చేశారు. జనవరి 2 , 2013 న అక్బర్ పై నిర్మల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జనవరి 8 , 2013 న అక్బర్ ను అరెస్ట్ చేశారు. జనవరి 8 న అక్బర్ ను హైదరాబాద్ నుండి నిర్మల్ కు తరలించారు. జనవరి 9న నిర్మల్ లో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లో గడిపారు. ఫిబ్రవరి 16, 2013 న జైల్ నుండి బెయిల్ పై అక్బర్ విడుదలయ్యారు. ఇక మరో కేసు విషయానికి వస్తే డిసెంబర్ 8, 2012 న నిజామాబాద్ లో ప్రసంగిస్తూ జనవరి 1 న సిఐడికి ప్రభుత్వం కేస్ అప్పగించింది. నిజామాబాద్ లో 41 మంది , నిర్మల్ కేసులో 33 మంది సాక్షులను విచారించిన సిఐడి అధికారులు 153(a), 295(a), 298, 506, 505 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2016లో సిఐడి, నిర్మల్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దానికి సంబందించిన కేసులను కోర్టు వేసింది.