సీఎం సభ వద్ద కలకలం.. బాంబ్ బ్లాస్ట్?
బీహార్‌లోని నలంద జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటనలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతానికి సరిగ్గా ఐదు మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని, దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. పేలుడు అనంతరం భయాందోళన నెలకొంది. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం అయితే లేదు. వేదిక వెనుక మైదానంలో బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం. మంగళవారం సీఎం నితీశ్ కుమార్ తొలుత పావపురి వెళ్లారు. అక్కడి నుంచి సిలావ్ మీదుగా రాజ్‌గిర్ వెళ్లాలి. ఈ క్రమంలో సిలావ్ గాంధీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు వందల యాభై మందిని కూర్చోబెట్టి దరఖాస్తులు తీసుకుంటున్న సమయంలో ఇది జరిగిందని అంటున్నారు. పెద్ద శబ్దం రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. మరో పక్క కొద్దిరోజుల క్రితమే పాట్నా సాహిబ్ దగ్గర కూడా నితీష్‌పై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన వ్యక్తి నితీష్‌పై దాడికి పాల్పడ్డాడు.