Bald head Union : పెన్షన్ కోరుతున్న బట్టతల బాధితులు, ఫన్నీ కామెంట్లు చేస్తున్న నెటిజనులు
Bald head Union in Koheda demands Pension from KCR government
సమాజంలో అనేక మంది బాధితులు ఉంటారు. అనేక కారణాలచే బాధింప బడుతూ ఉంటారు. బాధితులు అందరూ కలిసి ఓ సంఘం ఏర్పాటు చేసుకుంటారు. బాధిత సంఘాలుగా ఏర్పడతారు. కలిసికట్టుగా తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుంటారు. భార్యల చేతుల్లో బాధింపబడే భర్తలందరూ కలిసి భార్యా బాధితుల సంఘం అని ఏర్పాటు చేసుకోవడం మనం అనేక సార్లు వినే ఉంటాం. చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతూనే ఉంది.
తాజాగా సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో బట్టతల బాధితులందరూ ఏకమయ్యారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. సమాజంలో ఎన్నో అవమానాలకు గురౌతున్నామని, మానసికంగా బాధింపబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నెలవారీ పెన్షన్ కింద ప్రతి నెలా 6 వేల రూపాయల పెన్షన్ ఇప్పించాలని కోరారు.
కోహెడ మండలంలో తంగాళపల్లిలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బాధితులందరూ సమావేశం అయ్యారు. వారి బాధలను పంచుకున్నారు. సమాజంలో పలు చోట్ల తమకు ఎదురైన చేదు అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
సిద్ధిపేట జిల్లాలోని జరిగిన ఈ సమావేశ వివరాలతో కూడిన వార్త కొన్ని పత్రికల్లో వచ్చింది. ఆ పత్రికల క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. ఈ క్లిప్పింగ్స్ పై కొంత మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.