కేటీఆర్ విత్ డ్రా చేసుకోవాలి.. రాష్ట్రానికి రమ్మని ఏపీ మంత్రి ఆహ్వానం!
ఏపీ గురించి మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో మంత్రిని టార్గెట్ చేయగా ఇప్పుడు ఏపీ మంత్రులు కూడా ఆ విషయం మీద స్పందించారు. మంత్రి బొత్స స్పందిస్తూ ఇది చాలా సున్నితమైన అంశం అని అన్నారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు, కానీ నేను హైదరాబాద్ లో ఉండి వస్తున్నా అక్కడ కరెంటే లేదని అన్నారు. నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందని అన్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు అంతేగాని ఇలా అంటారా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా అని అన్నారు. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడొచ్చా?? అని ప్రశ్నించిన ఆయన కేటీఆర్ తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని కోరారు.
ఇక మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కేటీఆర్ ఒకసారి రాష్ట్రానికి రండి అని కొరారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళ్లతో చూడండని ఆయన కోరారు. అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వండి, మీ రాష్ట్రంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించండని కోరారు. ఇతర రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు మా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి అభినందిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆసరా, అమ్మ ఒడి , 31 లక్షల జగనన్న గృహాలు, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవని, భారతదేశంలోనే అవినీతి రహిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.