వేసవి సైతం లెక్క చేయని శ్రీవారి భక్తులు
Lord Venkateswara Swamy : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల( Tirumala)లో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వెంకన్న దర్శనానికి భక్తులు రోజురోజుకు పోటెత్తుతున్నారు. . వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ( Vaikuntam Queue Complex) లన్నీ భక్తులతో నిండిపోగా.. ఉచిత దర్శనానికి ఈ రోజు 12 గంటల సమయం పడుతోంది. స్పెషల్ ఎంట్రీ ( రూ. 300) దర్శనానికి 6 గంటల సమయం .. కాలి నడకన వచ్చిన భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
మొన్న 85,297 మంది భక్తులు రాగా..నిన్న 84,539 మంది భక్తులు (devotees) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 39,812 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. శనివారం 3.71 కోట్ల ఆదాయం రాగా.. ఆదివారం 3.72 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. అలాగే ఈ రోజు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తెలిపారు.
మరోవైపు తిరుమల భక్తులకు శుభవార్త త్తెలిపింది. టీటీడీ ఈ నెల 24వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. అలాగే. జులై, ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని.. టికెట్లకు అప్లై చేసుకోవాలని టీటీడీ పాలక మండలి సూచించింది. టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
కాగా, తిరుమలలో నిన్న 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా.. ఈ రోజు 4 కంపార్టు మెంట్లులలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసింది. దీనివల్ల మూడు గంటల సమయం ఆదా అవుతుందని టీటీడీ తెలిపింది.