వేసవి కాలం కావడంతో పెరుగుతున్న భక్తుల రద్దీ..
Lord Venkatewara Swamy : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల( Tirumala)లో శని, ఆదివారాలతో పోలిస్తే భక్తుల రద్దీ కాస్త తగ్గినా వేసవి కాలం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ( Vaikuntam Queue Complex) లన్నీ భక్తులతో నిండిపోగా.. ఉచిత దర్శనానికి ఈ రోజు 24 గంటల సమయం పడుతోంది. స్పెషల్ ఎంట్రీ ( రూ. 300) దర్శనానికి 6 గంటల సమయం .. కాలి నడకన వచ్చిన భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
మంగళవారం 77,436 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,980 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. 3.77 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. అలాగే ఈరోజు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తెలిపారు.
మరోవైపు విద్యార్ధులకు సమ్మర్ హాలీడేస్ కావడంతో శ్రీవారికి భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. అయితే దర్శన టిక్కెట్లలో టీటీడీ చేసిన మార్పులు(Changes) తెలియని కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలిపిరి(Alipiri) నుంచి కాలినడకన ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో గాలి గోపురం( Gali Hopuram) వద్దే దివ్య దర్శన టిక్కెట్లు జారీ చేసేవారు. కానీ రీసెంట్ గా అలిపిరి భూదేవి కాంప్లెక్స్(Bhudevi Complex) లో దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. అంతేకాదు టోకెన్లు పొందిన భక్తులంతా తప్పనిసరిగా స్కాన్(Scan) చేయించుకునే దర్శనానికి వెళ్లాలి లేదంటే స్వామి దర్శనానికి వారిని అనుమతించరని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.
శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద జారీ చేస్తారు. ఈ కేంద్రాన్ని మార్చలేదు. టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల కేంద్రాన్ని మాత్రం మార్చారు టీటీడీ అధికారులు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు. వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, తిరుపతి రైల్వేస్టేషన్ వెనుకాల గోవింద రాజసత్రాలు జారీ చేస్తున్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.