కొండ మీద కిటకిట
Heavy Rush In Tirumala : తిరుమల (Tirumala) కొండలు భక్తుల(Devotees)తో కిటకిటలాడుతున్నాయి. వేసవి (Summer)లో నిత్యం రద్దీగా ఉండే వెంకన్న కొండలు ఈ వారం ఊహించని విధంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు (Holidays) కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇంటర్, టెన్త్ ఫలితాలు వెలువడటంతో పలు పోటీ పరీక్షలు (Exms) ముగియడంతో పాటు, వచ్చే వారం నుంచి మళ్లీ చాలా చోట్ల విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొండపై రద్దీ (Rush) అమాంతం పెరిగిపోయింది.
48 గంటలు …
భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది. భక్తులకు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి క్యూలైన్లలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయాయి. వసతి గదులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. సీఆర్ఓ వద్ద గదుల కోసం క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా అత్యధిక సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో, భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. శిలాతోరణం వరకూ జనం బారులు తీరారు.
టీటీడీ ఏమంటోందంటే..
అయితే, తిరుమలలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రికులు తమ పర్యటనను రూపొదించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సర్వ దర్శనం క్యూలైన్లలో టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని సూచించింది. ప్రయాణాలు మరో రోజుకు వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే కొండమీదకు వచ్చిన భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రద్దీకి దగిన విధంగా క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలను పెంచింది. అన్న ప్రసాదాలను క్యూ లైన్లో భక్తులకు అందచేస్తోంది.