యాదగిరిగుట్ట నీ సొంత ఆస్తికాదు: డీకే అరుణ
తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయ పునఃప్రాంరభానికి రాష్ట్ర ప్రధమ పౌరురాలు తమిళి సై సౌందర రాజన్‌ను ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో జిల్లాల పేర్లను తనకు నచ్చినట్లు మార్చుకున్న సీఎం.. దేవాలయాల పేర్లు సైతం తనకు నచ్చినట్లు మార్చుకుంటున్నారన్నారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా ఎలా మారుస్తావంటూ డీకే అరుణ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఎంతో పురాతన ఆలయ పేరును ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట నీ సొంత ఆస్తా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునే సీఎం.. గవర్నర్‌ని ఎందుకు ఆహ్వానించలేదుని ప్రశ్నించారు. మహిళలను గౌరవించలేని వ్యక్తి సీఎం సీట్లో ఉండటానికి వీళ్లేదన్నారు. ప్రజలు ఇచ్చిన దాన ధర్మాల వల్లే ఆలయ నిర్మాణం జరిగిందన్న డీకే అరుణ.. ఆలయానికి సీఎం తన జేబులోంచి ఒక్క రూపాయి పెట్టలేదన్నారు.