హైదరాబాద్‌లో వింగ్స్ 2022 ఏవియేషన్ షో
ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో… వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా హాజరై వేడుకలను ప్రారంభించనున్నారు.
ఇందులో మొదటి రెండు రోజులు బిజినెస్ విజిటర్స్, తర్వాతి రెండు రోజులు జనరల్ పబ్లిక్‌కి అనుమతి ఉంటుందని నిర్వాహితులు తెలిపారు. ఈ వేడుకల్లో ఎయిర్ బస్ A350 విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు బిజినెస్ విజిటర్స్‌కు 2 వేల 500, జనరల్ పబ్లిక్‌కు 500గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయడానికి వీలుంటుంది.