ఉత్కంఠ రేపుతున్న బీజేపీ హై కమాండ్ నిర్ణయం
Raja Singh : బీజేపీ (BJP)గోషామహల్ ఎమ్మెల్యే (MLA)రాజాసింగ్ (Rajasing)పై సస్పెన్షన్ వేటు ఎత్తివేసే అవకాశముందా? హై కమాండ్ ఆలోచన ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది. రాజాసింగ్‌కు త్వరలో బిగ్ రిలీఫ్ (Big Relief)రాబోతోందని, . త్వరలోనే తమ పార్టీ సస్పెన్షన్ (Suspension)ను ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సూచన ప్రాయంగా తెలిపారు. అయితే సస్పెన్షన్ ఎత్తివేతపై తుది నిర్ణయం పార్టీదేనన్నారాయన.
సస్పెన్షన్ ఎందుకంటే?
గత ఏడాది ఆగస్టు (Augest)లో మహ్మద్ ప్రవక్త పై రాజాసింగ్(Rajasing)చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ (Suspend)చేసింది. రాజా సింగ్‌ను ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని బీజేపీ(Bjp) కోరింది. నగరంలోని ప్రముఖ హాస్యనటుడు మునవర్ ఫరూఖీ షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు నగర పరిధిలోని చాలా పోలీస్ స్టేషన్లలో (Police Station) ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు.
పార్టీ మారంటూ క్లారిటీ..
అయితే కొన్నాళ్ల క్రితం ఆయన తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు మొదలయ్యాయి. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని స్వయంగా ప్రకటించారు. బీజేపీని వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్ తెలిపారు.