మంత్రి హరీశ్ రావు(Harish Rao)పై మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumantha Rao) ఘాటు విమర్శలు చేసి హాట్ టాపిక్‌గా మారడంతో.. దీనిపై గులాబీ బాస్ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
KCR decision : బీఆర్ఎస్ తొలి జాబితాలో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్(KCR).. నాలుగు సెగ్మెంట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టేసారు.అయితే ఇప్పుడు నర్సాపూర్(Narsapur), జనగాం (Janagam), నాంపల్లి(Nampalli), గోషామహల్(Goshamahal)పై స్పెషల్ ఫోకస్ పెట్టి.. గెలుపు గుర్రాలను మాత్రమే ఎంచుకుని..ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనగాం(Janagam) నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeswar Reddy), నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy), నాంపల్లి (Nampalli)నుంచి ఆనంద్ గౌడ్(Anadh Goud), గోషామహల్ (Goshamahl) నుంచి నందకిశోర్ వ్యాస్(Nanda Kishore Vyas) పేర్లను డిక్లేర్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే నర్సాపూర్(Narsapur), జనగాం(Janagam)కు ఇంతకు ముందే అభ్యర్థులను ఖరారు చేసినా, అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి కేసీఆర్ ఈ స్థానలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన స్థానాలలో కూడా.. కాంట్రవర్సీ ఉన్న ఒకటీ, రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అటు మంత్రి హరీశ్ రావు(Harish Rao)పై మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumantha Rao) ఘాటు విమర్శలు చేసి హాట్ టాపిక్‌గా మారడంతో.. దీనిపై గులాబీ బాస్ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ నేతలుకూడా మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు… మైనంపల్లిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లికి బదులు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మల్కాజిగిరి టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.