పార్లమెంట్(Parliament)లో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) చెప్పారు.
MLC KAVITHA : పార్లమెంట్(Parliament)లో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) చెప్పారు. ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత… మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
మహిళ బిల్లుకు కేంద్రం ఆమోదించడంతో కవిత తన నివాసం వద్ద మహిళలతో కలిసి సోమవారం బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కనీసం ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు. కేంద్రం పారదర్శకంగా ఉండాలన్నారు. అంతేకాదు..దీనిని దాయాల్సిన అవసరం లేదని చెప్పారు.
మరోవైపు మహిళా బిల్లుపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్లు మీడియా చానల్స్‌తో పాటు..సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీంతో పాటు దీనిపై కేంద్ర మంత్రి కూడా ట్విట్ చేశారు.అయితే ఏ బిల్లు పాస్ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. . ఏది ఏమయినా కేంద్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అధికారంలో సగం కావాలన్న ఎన్నో ఏళ్ల మహిళల కల సాకారం కాబోతుంది.