VH: కోమటిరెడ్డి పార్టీ మార్పుపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
Vh Comments on Komatireddy Party Change: కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన త్వరలో బీజేపీలో చేరటం ఖాయం అని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని కొన్ని వర్గాల సమాచారంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. చాలా కాలం నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం తీరుతో ముభావంగానే ఉంటున్న ఆయన ఇక కాంగ్రెస్ ను వీడియో కాషాయ కండువా కప్పుకోవటం దాదాపు ఖరారు అయిపోయిందని అంటున్నారు.
తాజాగా ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. నల్గొండ అంటేనే కాంగ్రెస్ జెండా అంటారు కానీ అక్కడే లుకలుకలు అవుతున్నాయని ఆయన అన్నారు. మొదటే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతే ఇక నలుగురే ఉంటారని పేర్కొన్న ఆయన ఈ విషయంపై బట్టి విక్రమార్క స్పందించాలని అన్నారు. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం చేయొద్దన్న వీహెచ్ స్టార్ క్యాంపెనర్ తమ్ముడు వెళ్ళిపోతుంటే ప్రజల్లో ఎటువంటి అనుమానం వస్తుందో గుర్తించాలని, ఈ విషయంపై హై కమాండ్ దృష్టి పెట్టాలని అన్నారు. ఇక స్టార్ క్యాంపెనర్ దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లనుందో చూడాలి.