Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. వెంట ఉన్నవాళ్లంతా దొంగలు
Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు, ఆయన వెంట ఉన్నవాళ్లంతా దొంగలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మాటలు తప్ప, రూపాయి సాయం చేయలేదని బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు కేసిఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందేనని అన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలో ఎంత మందికి వచ్చింది? ఇప్పుడు ఎంత మందికి వస్తుంది? ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలి? అని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులవి అన్నీ అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు అని అన్నారు. ఇక మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరి గోస పడుతున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపీ ప్రశ్నిస్తున్నాడు అని ఎల్ఐసి, ఎస్బిఐలో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ, సంబంధంలేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నారని అన్నారు.