V.Hanumantha Rao: రేవంత్ పై దాడి.. కేసీఆర్ కు వీహెచ్ హెచ్చరిక!
V.Hanumantha Rao: భూపాలపల్లి సభలో రేవంత్ పై కోడి గుడ్లు వేయడం దుర్మార్గం అని వీ హనుమంతరావు అన్నారు. రాళ్లు వేసి కొట్టడం ఎంత వరకు న్యాయం? ప్రజాస్వామ్యమా ఇది రాచరికమా..? అని ఆయన ప్రశ్నించారు. దాడులు చేయడం ఇదేం పద్ధతి, సీఎం దగ్గర మార్కులు కొట్టేయడం కోసం దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏపీలో సభ పెడితే అక్కడ కూడా అలాగే చేయమంటారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ లో పెట్టండి, మాపై రాళ్లు కొడితే ఏపీకి పోతే నీకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. జాతీయ పార్టీ నేత అవుతా అంటున్నావు? ఇదేనా మీ విధానం అందరూ ఇదే ఆలోచన చేస్తే..ఎవ్వడూ మీటింగ్ పెట్టలేడని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు వేస్తూ దాడికి పాల్పడ్డారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం ఆయన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోన్న క్రమంలో అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలో దాడి జరిగింది.