Uttam Kumar Reddy: టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హర్షవర్ధన్ కి కాంగ్రెస్ మద్దతు
Uttam Kumar Reddy: టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హర్షవర్ధన్ కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. . మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం నాయకుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించేందుకు కృషి చేస్తుందన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ, విద్య సంబంధ సమస్యలపై 20 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు దీంతో ఆయనను గెలిపించేందుకు మండలి ఎన్నికల పరిధిలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆయన విజయానికి సమిష్టిగా కృషి చేస్తుందని అన్నారు. అభ్యర్ధిని గెలిపించేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామన్నారు. టీచర్లు ఆయనకు ఓటేసి గెలిపించండన్న ఆయన ఉపాధ్యాయుల సమస్యల కోసం ఎంతో త్యాగం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశారని అన్నారు. టీచర్ల సంక్షేమం కోసం పోరాడే వ్యక్తి అని అనుభావం ఉన్న వ్యక్తి హర్షవర్ధన్ అని అన్నారు. టీచర్లకు హామీ ఇస్తున్నాం, పాత పెన్షన్ విధానం పునరుద్దరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీఆర్సీ కమిషన్ ప్రకటించాలన్న ఆయన స్థానికత పోగొట్టుకున్న వారికి లోకల్ స్టేటస్ ఇస్తామని అన్నారు. ప్రమోషన్ల విషయంలో ఉపాధ్యాయులను తెలంగాణ ప్రభుత్వం అవమానంగా చూసిందని, గతంలో ఎన్నుకున్న ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరి..సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. టీచర్లకు సర్వీసు రూల్స్ ఇచ్చి ప్రమోషన్ లు వెంటనే ఇవ్వాలన్న ఆయన జీతాలు ఏ తేదీన వస్తాయో కూడా తెలియదని అన్నారు.