కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారు: బాల్క సుమన్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను నూకలు తినాలని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరాల్సిందే అన్న బాల్క సుమన్.. గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి పీఎంఓకు పంపుతామన్నారు.
గతంలో రైతులు వరి పంట వేసుకోవచ్చని బండి సంజయ్ అన్నారని బాల్క సుమన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తాను రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి వివరిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ధాన్యం ఎంత పంపించాలనుకుంటుందో ముందే లేఖరాయాలని బండి సంజయ్ గతంలోనే చెప్పినట్లు బాల్క సుమన్ గుర్తు చేశారు. గతంలో మాట ఇచ్చిన సంజయ్ ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.