గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు.. ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది.
TSRTC: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు.. ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తుంది. ప్రయ్నక్కుల సౌకర్యార్థం ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలు చేస్తుంది. కాగా తాజాగా ఆర్టీసీ సరికొత్త ఆలోచన చేసింది. అదే టికెట్ తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని నిర్ణయించింది. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ ‘స్నాక్ బాక్స్’ విధానాన్ని అలాగే ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ -గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని నేటి నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని దానిని ఫోన్లలో స్కాన్ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు.
ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోంది.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే 'స్నాక్ బాక్స్'ను ఇవ్వాలని #TSRTC సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ… pic.twitter.com/d2Yp5c3I7e
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 26, 2023