నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్లే దిశగా సంస్థ చకచకా అడుగులు వేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొత్త ఆలోచనలతో బస్సును పరుగులు పెట్టిస్తున్నారు. విన్నూత్న ఆలోచనలతో ఆయన అడుగులు వేస్తున్నారు. పోలీసు అధికారి అయిన ఆయన ప్రజాకోణంలో ఆలోచించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి.
Tsrtc Snacks Box: నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్లే దిశగా సంస్థ చకచకా అడుగులు వేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొత్త ఆలోచనలతో బస్సును పరుగులు పెట్టిస్తున్నారు. విన్నూత్న ఆలోచనలతో ఆయన అడుగులు వేస్తున్నారు. పోలీసు అధికారి అయిన ఆయన ప్రజాకోణంలో ఆలోచించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. ఆర్టీసీ సంస్థ తమ కాళ్ల మీద తాము నిలబడేటట్లు చేయాలన్నది ఆయన యత్నం. అది భగీరథ ప్రయత్నమే అని తెలిసినా సజ్జనార్ మాత్రం తన ఆలోచనలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. మారుతున్న కాలానికనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధునిక విధానాలు.. సరికొత్త ఒరవడితో ముందుకువెళుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు మరింతగా తీసుకెళ్లేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్టీసీ సేవలు మరింత విస్తరణ చేస్తుంది.. ఆదాయ మార్గాలను సుగమమం చేసుకునేందుకు సరికొత్త పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఈమద్యే గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అలాగే ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ఆర్టీసి బస్సును ఎలక్ట్రికల్ బస్సుగా మార్చడానికి ఆ సంస్థ ఓ ప్రయోగాన్ని చేపట్టింది. అది సక్సెస్ అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వ అనుమతితో ముందుగా 1,000 బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నిర్ణయంతో దాదాపుగా ఆర్టీసీ నటిస్తాలనుండి లాభాలబాట పట్టవచ్చు. అలాగే టికెటింగ్ లో కూడా వినూత్నమైన మార్పులను తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ.
టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. డిజిటల్ చెల్లింపుల ద్వారా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. అయితే కార్డ్ ద్వారా కూడా.. చెల్లింపులు చేయోచ్చు. బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ డిజిటల్‌గా మారేందుకు సిద్ధమైంది. నగర ప్రయాణికులు ఇప్పుడు నగదురహిత లావాదేవీని ఉపయోగించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. ట్రయల్ రన్లో మంచి స్పందన లభించింది. జూన్ చివరి నాటికి ఆండ్రాయిడ్ ఆధారిత టికెట్ జారీ యంత్రాలను ప్రవేశపెట్టాలని TSRTC యోచిస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు UPI చెల్లింపులను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సరికొత్త ఆలోచలకు పునాదులు వేస్తుంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ అనేక ప్రయోగాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనరల్ రూట్ పాస్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంస్థ తాజాగా ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్ బాక్స్ ను ప్రవేశపెడుతుంది.
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు జర్నీలో స్నాక్స్ బాక్స్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ భావించింది. ఆర్టీసీ ఇప్పటికే ఏసీ సర్వీసుల్లోవాటర్ బాటిల్స్ ఇస్తుంది. తాజాగా స్నాక్స్ బాక్స్ కూడా ఇస్తే బాగుటుందని ఆలోచన చేస్తోంది. స్నాక్స్ బాక్స్ అందివ్వడాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో తిరిగే తొమ్మిది ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో ఈ విధానాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రయాణికు ల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు వర్తింపజేస్తామన్నారు. ఈ స్నాక్స్ బాక్స్‌లో మిల్లెట్స్‌తో తయారు చేసిన ఖారా, చిక్కీ ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెష్నర్, టిష్యూ పేపర్ ఉంటాయని తెలిపారు. స్నాక్స్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 వసూలు చేస్తామని చెప్పారు. స్నాక్స్ బాక్స్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేసి ప్రయాణికులు తమ సూచనలు ఇవ్వవచ్చని సూచించారు. ఈ స్నాక్ బాక్స్ సౌకర్యం విమానాలలో మాత్రమే అందిస్తారు.. మరి ఇలాంటి సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ నేటి నుండి అమల్లోకి తీసుకొస్తుంది. మరి ఈ దిశగా ముందడుగులేస్తున్న ఆర్టీసీ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.